తుల్జాభ‌వాని ఆల‌యంలో ఘ‌నంగా మాతా శ్రీ అమ్మ జిల్లోల ముడి జ‌న్మ‌దిన వేడుక‌లు

శేరిలింగంప‌ల్లి, మార్చి 29 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంప‌ల్లిలోని తుల్జాభ‌వాని దేవాల‌య ప్రాంగ‌ణంలో మాతా శ్రీ అమ్మ జిల్లోల ముడి 103వ జన్మదినం సంద‌ర్భంగా అన్న‌దాన కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో మధుర భారతి ఆచార్య మల్లా ప్రగడ శ్రీమన్నారాయణ మూర్తి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ అమ్మ గొప్ప‌త‌నాన్ని వివ‌రించారు. వాడ వాడ‌లా అన్న‌దాన కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించాల‌ని అన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్‌సీయూ ఆచార్యులు ఎస్వీ ఎస్ నాగేశ్వరావు, ఆచార్య పమ్మి పవన్ కుమార్, పూర్వ విద్యార్థులు పార్థసారథి, విజయపాల్ రెడ్డి, ఎం.శంకర్, సురేష్, యూహెచ్ క్యాంపస్ స్కూల్ ప్రిన్సిపాల్ పి మురళి, టి శ్రీనివాసరావు, జీవన్, మంగేష్కర్, అశోక్, పరశురాం, కృష్ణ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here