శేరిలింగంపల్లి, మార్చి 28 (నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్ శిల్పారామంలో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా భరతనాట్య కళాకారిణి శృతి శ్రీనిధి తన ప్రదర్శనలో మహాదేవ శంభో, మాత మలయధ్వజ, ఎహ్మని తెలుపుదు, శ్రీరామచంద్ర అంశాలను ప్రదర్శించి మెప్పించింది. సాంప్రదాయ భరతనాట్యం డాన్స్ స్కూల్ చెన్నై నుండి వచ్చిన భరతనాట్య గురువు శృతి ప్రియా విగ్నేష్ శిష్య బృందం భరతనాట్య ప్రదర్శనలో హరినారాయణ కౌతం, వర్ణం, శ్రీ రామచంద్ర కృపాలు భజన, అష్టపడి, బారో కృష్ణయ్య, తిల్లాన, అభంగ్ అంశాలను ఆద్య, ఆదర్శిని, రేఖ, మాళవిక, నిహారిక, వర్ష, సహన, నిత్య, అవనిజ ప్రదర్శించి మెప్పించారు.






