శ్రీరామ నవమి వేడుకల్లో పాల్గొన్న మాజీ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి

శేరిలింగంప‌ల్లి, మార్చి 27 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకొని చందానగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ మంజుల రఘునాథ్‌రెడ్డి శంకర్‌నగర్, వేమన కాలనీ, ఫ్రెండ్స్ కాలనీ, భవానీపురం, ఎస్వీఎస్ అవాస, దీప్తి శ్రీనగర్, సాయి నగర్, ఎంఐజీ, బీహెచ్ఈఎల్, నల్లగండ్ల ప్రాంతాల్లోని దేవాలయాల్లో కాలనీల్లో ఏర్పాటు చేసిన శ్రీరామ నవమి ప్రత్యేక పూజలు, కళ్యాణ మహోత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్తులకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపారు. ఆ శ్రీరాముని ఆశీస్సులతో ప్రతి కుటుంబం ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆమె ఆకాంక్షించారు. పర్యటనలో భాగంగా స్థానిక ప్రజలతో ముచ్చటించిన ఆమె, కాలనీల్లోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాలనీల సమగ్ర అభివృద్ధికి తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని, ప్రజల సమస్యల పరిష్కారంలో ముందుంటానని హామీ ఇచ్చారు. ఈ వేడుకల్లో స్థానిక నాయకులు, కాలనీ సంక్షేమ సంఘాల సభ్యులు, మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here