శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవాలలో పాల్గొన్న జగదీశ్వర్ గౌడ్

శేరిలింగంప‌ల్లి, మార్చి 27 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మియాపూర్ పరిధిలోని సాయి రామ్ నగర్, ప్రశాంత్ నగర్, అరబిందో కాలనీలలో నిర్వహించిన శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవాలలో శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్, TPCC జనరల్ సెక్రటరీ జగదీశ్వర్ గౌడ్, యలమంచి ఉదయ్ కిరణ్ చారిటబుల్ ట్రస్ట్ స్థాపకుడు, ఛైర్మన్ యలమంచి ఉదయ్ కిరణ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమాల‌ను సాయి రామ్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ (MD షా, సభ్యులు), ప్రశాంత్ నగర్ అసోసియేషన్ సభ్యులు, అరబిందో కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యుల ఆహ్వానం మేరకు నిర్వహించారు. ఈ కార్యక్రమాలలో నాయకులు వీరేందర్ గౌడ్, మన్నేపల్లి సాంబశివ రావు, రవి కుమార్, గోకినేపల్లి రమేష్, నాని, అశోక్, రాజేష్, సతీష్, గురువులు, వినయ్, జగన్, మనోజ్, నవీన్ యాదవ్ పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here