శ్రీ‌రాముడు మ‌న‌ల్ని మంచి మార్గం వైపు న‌డిపించాలి: జగదీశ్వర్ గౌడ్

శేరిలింగంప‌ల్లి, మార్చి 27 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శ్రీరాముడి ఆశీస్సులతో మన జీవితాల్లోని చెడు ఆలోచనలు తొలగి, మంచి మార్గం వైపు నడిపించాల‌ని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూన్నాన‌ని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి జగదీశ్వర్ గౌడ్ అన్నారు. శ్రీ రామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని శేరిలింగంపల్లి నియోజకవర్గం ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియ‌జేశారు. ఈ సందర్భంగా శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని ఎల్లంబండ, కూకట్‌ప‌ల్లి, హైదర్ నగర్, మియాపూర్, మాదాపూర్, మాతృశ్రీ నగర్, హఫీజ్ పేట్, మదీనాగూడ, చందానగర్, కొండాపూర్ డివిజన్ ల‌లో నిర్వహించిన శ్రీ సీతరాముల వారి కల్యాణ మహోత్సవంలో స్థానిక కాలనీ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here