మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి మాతృమూర్తి మృతి ప‌ట్ల సంతాపం

శేరిలింగంప‌ల్లి, మార్చి 24 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): చేవెళ్ల మాజీ పార్లమెంట్ సభ్యుడు డాక్టర్ జి. రంజిత్ రెడ్డి మాతృమూర్తి జి. చంద్రకళమ్మ మృతి చెందిన విషయం తెలుసుకున్న PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ వెంట‌నే త‌ర‌లివెళ్లి ఆమె పార్థివ దేహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. జూబ్లీహిల్స్ లోని రంజిత్ రెడ్డి నివాసంలో స్పీకర్ గడ్డం ప్రసాద్, మాజీ కార్పొరేటర్లు నార్నె శ్రీనివాసరావు, ఉప్పలపాటి శ్రీకాంత్, సీనియర్ నాయకులు రఘునాథ్ రెడ్డి, గంధం రాములు, ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ చంద్రకళమ్మ మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాన‌ని అన్నారు. ఆమె మరణం తీరని లోటు అని, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాన‌ని, ఆమెకు సద్గతి ప్రాప్తించాలని, ఆమె కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నాన‌ని గాంధీ తెలియ‌జేశారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here