శేరిలింగంపల్లి, మార్చి 24 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని కొండాపూర్, శ్రీరామ్‌నగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ నాయకుడు విజయ్ రెడ్డితో కలిసి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు మారబోయిన రవి యాదవ్ జలనిధి రజక సేవా సంఘం బల్లాల పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పూజా కార్యక్రమంలో పాల్గొని సంఘం సభ్యులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు, స్థానిక నాయకులు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.







