ఘ‌నంగా శ్రీశ్రీశ్రీ విజయదుర్గా భవాని అమ్మవారి వార్షిక బోనాల మహోత్సవం

శేరిలింగంప‌ల్లి, మార్చి 22 (న‌మస్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంపల్లి డివిజన్ ఆదర్శ్ నగర్ లోని శ్రీశ్రీశ్రీ విజయదుర్గా భవాని అమ్మవారి వార్షిక బోనాల మహోత్సవంలో శేరిలింగంపల్లి మాజీ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజ కార్యక్రమాల్లో ఆయ‌న పాల్గొన్నారు. అనంతరం రాగం నాగేంద‌ర్ యాద‌వ్ మాట్లాడుతూ శ్రీశ్రీశ్రీ విజయ దుర్గ భవాని అమ్మవారి కృపతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మిరియాల రాఘవరావు, అశోక్, కర్ణ, శ్రీనివాస్, బాబు, సుధాకర్ రెడ్డి, రేణు, రమేష్, రవీందర్, ప్రవీణ్, ప్రణీష్, రఘు, తిరుమలేష్, గోపాల్, మల్లేష్, సురేష్, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here