శేరిలింగంపల్లి, మార్చి 10 (నమస్తే శేరిలింగంపల్లి): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర మాజీ సోషల్ వెల్ఫేర్ బోర్డు ఛైర్ పర్సన్ రాగం సుజాత యాదవ్, శేరిలింగంపల్లి మాజీ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ తనయుడు, రాష్ట్ర యువజన నాయకుడు రాగం అనిరుధ్ యాదవ్ జన్మదిన సందర్భంగా నల్లగండ్లలోని వర్టెక్స్ కింగస్టన్ పార్క్ విల్లాస్ నివాసంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి సీనియర్ నాయకులు, మహిళా నాయకురాళ్లు, యువ నాయకులు, బూత్ కమిటీ సభ్యులు, కాలనీ అసోసియేషన్ అనుబంధ సభ్యులు పాల్గొని భారీ ఎత్తున కేక్ కట్ చేసి రాగం అనిరుధ్ యాదవ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.






