శేరిలింగంపల్లి, మార్చి 9 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ సర్కిల్ ప్రధాన కార్యాలయంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో డీసీ శశిరేఖ, అధికారులతో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ పాల్గొని సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ పలు కాలనీ వాసుల నుండి వచ్చిన వినతి పత్రాలను పరిగణనలోకి తీసుకొని అత్యవసర పనుల పై తక్షణమే స్పందించి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రతి ఫిర్యాదు పై స్పందించాలని, ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలని , ప్రజల నుండి వచ్చే ప్రతి అర్జీ పరిష్కారానికి కృషి చేయాలని అన్నారు. ప్రజలకు ఎల్లవేళలా అధికారులు అందుబాటులో ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో GHMC ఇంజనీరింగ్ విభాగం అధికారులు DE శ్రీ దేవి, AE ప్రశాంత్, AE ప్రతాప్, AE ప్రశాంత్, మాజీ కౌన్సిలర్ రఘుపతి రెడ్డి, నాయకులు రఘునాథ్ రెడ్డి, ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, అక్బర్ ఖాన్, పోశయ్య, తిరుపతి, నరేందర్ బల్లా, సందీప్ రెడ్డి, యశ్వంత్ రెడ్డి, రాహుల్ తదితరులు పాల్గొన్నారు.






