శేరిలింగంపల్లి, మార్చి 6 (నమస్తే శేరిలింగంపల్లి): హైదర్ నగర్ డివిజన్‌లో స్థానిక ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ శేరిలింగంపల్లి ఇన్‌చార్జి మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు నిర్వహించారు. ఇందులో నాయకులు మహమ్మద్ సలీం, మహమ్మద్ ఖదీర్, సుబ్బరాజు, అడ్వకేట్ శ్రీకాంత్ యాదవ్, నక్క శ్రీనివాస్, కొండాపూర్ డివిజన్ నుంచి మహమ్మద్ అల్లావుద్దీన్ పటేల్, స్థానిక బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.






