బీసీల సింహ గర్జనను విజయవంతం చేయాలి: బేరి రామచంద్ర యాదవ్

శేరిలింగంప‌ల్లి, ఫిబ్ర‌వ‌రి 14 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): బీసీలకు రాజ్యాధికారం లక్ష్యంగా ఈనెల 22న విజయవాడలో నిర్వహించనున్న బీసీల సింహ గర్జన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్యవేదిక అధ్యక్షుడు బేరి రామచంద్ర యాదవ్ పిలుపునిచ్చారు. బీసీవై పార్టీ జాతీయ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ ఆధ్వర్యంలో నగరంలోని బీసీవై పార్టీ కార్యాలయంలో సింహ గర్జన పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బేరి రామచంద్ర యాదవ్ విజయవాడలో జరగనున్న బీసీల సింహ గర్జనకు తెలంగాణ నుంచి సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రకటించారు. తాను పార్టీ కార్యవర్గంతో కలిసి సింహ గర్జనలో పాల్గొంటానని తెలిపారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల సహకారంతో బహుజన రాజ్యాధికారం సాధనే లక్ష్యంగా ఈ కార్యక్రమం పునాది రాయిగా నిలుస్తుందని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా బోడే రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల నాయకులు, కార్యకర్తలు ఇరు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ సింహ గర్జనను చారిత్రాత్మకంగా మార్చాలని పిలుపునిచ్చారు. యువత, మహిళలు ప్రత్యేకంగా ముందుకు వచ్చి ఈ ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని కోరారు. బేరి రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన ప్రజలు, నాయకులు, కార్యకర్తలు అందరూ విజయవాడ సింహ గర్జనలో పాల్గొని తమ ఐక్యతను చాటాలని అభ్యర్థించారు. బోడే రామచంద్ర యాదవ్‌కు తెలుగు రెండు రాష్ట్రాల చైర్మన్‌గా, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా తన పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన బీసీ నాయకులతో పాటు తెలంగాణ రాష్ట్రం నలుమూలల నుంచి కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తెలంగాణ బీసీ ఐక్యవేదిక అధ్యక్షుడు బేరి రామచంద్ర యాదవ్‌తో పాటు బీసీవై పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి ఓరుగంటి వెంకటేష్ యాదవ్, ఆర్గనైజర్ సెక్రటరీ హరికృష్ణ చారి, ఉపాధ్యక్షులు ఈశ్వరన్న, ఆర్కే సాయన్న ముదిరాజ్, రాష్ట్ర మేదరి మహేంద్ర సంఘం యువజన విభాగం అధ్యక్షుడు సుమన్, రాష్ట్ర బీసీ కులాల ఐక్యవేదిక గౌరవ సలహాదారు పట్లూరి కృష్ణమోహన్, శేరిలింగంపల్లి-మాదాపూర్ యాదవ సంఘం నాయ‌కుడు ఎర్రగుంట్ల వెంకటేష్ యాదవ్, పల్నాడు యాదవ సంఘం నాయకులు, సినిమా దర్శకుడు మురళి యాదవ్, యాదవ కులాల జేఏసీ వైస్ చైర్మన్ శ్రీనివాస్ యాదవ్, బీసీవై పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ శివకుమార్ యాదవ్, బీసీ నాయకులు ఈశ్వరయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here