శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 14 (నమస్తే శేరిలింగంపల్లి): కొండాపూర్ డివిజన్ పరిధిలోని శ్రీరామ్ నగర్ కాలనీ ఎ బ్లాకులో 46 లక్షల రూపాయలు అంచనా వ్యయంతో నూతనంగా వేస్తున్న సీసీ రోడ్ల పని తీరును స్థానిక నాయకులతో కలసి కొండాపూర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ హమీద్ పటేల్ పర్యవేక్షించారు. సరైన నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ స్థానిక ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కాంట్రాక్టర్ కి హమీద్ పటేల్ ఈ సందర్బంగా సూచించారు. భవన యాజమానదారులు వెంటనే సరైన పద్ధతులు ప్రకారం డ్రైనేజీ లైన్లను కలుపుకోవాలని, రోడ్లు పూర్తి అయిన తర్వాత డ్రైనేజీ లేదా ఇతర పనుల నిమిత్తం రోడ్లను తవ్వటం పెద్ద సమస్యగా ఉంటుందని, కావున ప్రతి ఒక్క భవన యజమాని డ్రైనేజీ లైన్ ముందుగానే కలుపుకొని సహకరించాలని అన్నారు. ఈ పర్యవేక్షణలో సీనియర్ నాయకులు K. శివకుమార్, తిరుపతి యాదవ్, TV రమణ, M. ప్రసాద్ రావు, నర్సింహారెడ్డి, దీపక్, కాశీ తదితరులు పాల్గొన్నారు.






