శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 10 (నమస్తే శేరిలింగంపల్లి): ఆర్ఎస్ఎస్ సంస్థ అయిన సేవా భారతి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మెడికల్ క్యాంప్ లో డాక్టర్లు, నర్సులు, హాస్పిటల్స్ సిబ్బందితో కలిసి నేతాజీ నగర్ కాలనీ అధ్యక్షుడు బేరి రామచంద్ర యాదవ్, ఉపాధ్యక్షులు రాయుడు, నరసింహలు పాల్గొన్నారు. కాలనీలోని నాయకుల సహకారంతో ఎల్లమ్మ ఆలయం వద్ద ఉచిత మెడికల్ క్యాంపును నిర్వహించారు. ఇందులో భాగంగా ఉచితంగా మందులను కూడా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కృష్ణ ముదిరాజ్, ముకుంద రెడ్డి, ఆర్కే సాయన్న ముదిరాజ్, డాక్టర్లు మనోజ్ చరణ్ ధూపే, మనో చరణ్ ధూపే, మండల కృష్ణ ముదిరాజ్ పాల్గొన్నారు.






