శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 10 (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రఘునాథ్ రెడ్డి దంపతులను సురక్ష ఎన్ క్లేవ్ కాలనీ వాసులు ఘనంగా సన్మానించారు. గత ఐదు సంవత్సరాలుగా కాలనీలో నెలకొన్న దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరిస్తూ, అభివృద్ధి పనులను పరుగులు పెట్టించారని కాలనీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ కాలనీ వాసులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి స్థానిక ఎమ్మెల్యే, పిఎసి చైర్మన్ ఆరెకపుడి గాంధీ సహకారంతో అత్యాధునిక డ్రైనేజీ పైప్లైన్ల ఏర్పాటుతో మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించామని, ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన మంచినీరు అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సురక్ష ఎన్ క్లేవ్ కాలనీ అధ్యక్షుడు రవి, జనరల్ సెక్రటరీ పోచయ్య , వైస్ ప్రెసిడెంట్ యుంగధర్ రెడ్డి, కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు.






