ఆలయ ఆహ్వాన ప‌త్రిక‌కు కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పూజ‌లు

శేరిలింగంప‌ల్లి, ఫిబ్ర‌వ‌రి 8 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంపల్లి డివిజన్ లోని రాజీవ్ గృహకల్పలో శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ తన సొంత ఖర్చులతో నిర్మించిన ఆల‌యాన్ని ఈ నెల 18,19, 20 తేదీలలో శ్రీశ్రీశ్రీ మాధవానంద సరస్వతి స్వామి ఆశీస్సులతో ప్రారంభించనున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోయే శ్రీ షిర్డీ సాయినాథ, మార్కండేయ స్వామి, సంతాన నాగదేవత అమ్మవారి పునః ప్రతిష్ట మహోత్సవం సందర్భంగా గజ్వేల్ లోని శ్రీశ్రీశ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలయంలో మొదటి ఆహ్వాన పత్రికను ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించి మాధవానంద సరస్వతి స్వామికి శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ అందజేశారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here