సేవా భారతి ఆధ్వర్యంలో నేతాజీ నగర్ లో ఫ్రీ మెడికల్ క్యాంపు

శేరిలింగంప‌ల్లి, ఫిబ్ర‌వ‌రి 8 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): RSS కు అనుబంధంగా పనిచేస్తున్న సేవా భారతి ఆధ్వర్యంలో నేతాజీ నగర్ ఎల్లమ్మ ఆల‌య‌ ప్రాంగణంలో ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఈ శిబిరంలో పాల్గొన్న వైద్యులు రోగుల‌కు ఉచితంగా ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించి అనంత‌రం మందుల‌ను సైతం ఉచితంగానే పంపిణీ చేశారు. నేతాజీ నగర్ నుండి 200 మంది వరకు పాల్గొన్నారు. ఈ కార్య‌క్ర‌మ నిర్వ‌హ‌ణ‌కు స‌హ‌క‌రించిన వెస్టిన్ హాస్పిట‌ల్ యాజ‌మాన్యానికి సేవా భారతి ప్ర‌తినిధులు ధ‌న్య‌వాదాలు తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here