వ్య‌క్తిపై దాడి కేసులో నిందితుడి అరెస్టు

శేరిలింగంప‌ల్లి, ఫిబ్ర‌వ‌రి 6 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో మహాప్రస్థానం సమీపంలో జరిగిన దోపిడీ కేసును పోలీసులు ఛేదించినట్లు రాయదుర్గం డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ టి. భూపతి తెలిపారు. వివరాల్లోకి వెళితే.. తనను ఓ వ్యక్తి రాయితో గాయపరిచి తన మొబైల్ ఫోన్ లాక్కొని పారిపోయాడని మహమ్మద్ ఓవైసీ అనే ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించమన్నారు. ఈ నెల 3వ తేదీన రాత్రి 10.30 గంటల సమయంలో నిందితుడు మహమ్మద్ జావీద్ (24).. మహమ్మద్ ఒవైసీపై రాయితో దాడి చేసి గాయపరిచాడు. అనంతరం బాధితుడి యూపీఐ ఖాతా ద్వారా రూ.400 బదిలీ చేయించుకొని మొబైల్ ఫోన్ లాక్కొని ద్విచక్ర వాహనంపై పరారయ్యాడు. ఈనెల 5వ తేదీన రాయదుర్గం పీఎస్ క్రైమ్ సిబ్బంది నిందితుడు జావీద్‌ను చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. అత‌ను టోలిచౌకిలోని పారామౌంట్ కాల‌నీలో నివాసం ఉంటున్నాడ‌ని, స్థానికంగా ప్లంబ‌ర్‌గా ప‌నిచేస్తూ జీవ‌నం సాగిస్తున్నాడ‌ని పోలీసులు తెలిపారు. అతని వద్ద నుంచి దొంగిలించిన మొబైల్ ఫోన్‌తో పాటు మరో రెండు మొబైల్ ఫోన్లు, నేరానికి ఉపయోగించిన ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకొని రిమాండ్ కు తరలించామ‌ని పోలీసులు తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here