శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 6 (నమస్తే శేరిలింగంపల్లి): హఫీజ్‌పేట్ డివిజన్ పరిధిలోని సాయి నగర్, యూత్ కాలనీల్లో నూతనంగా చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బాలింగ్ గౌతమ్ గౌడ్ క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు.ఈ సందర్భంగా ఆయన కాలనీ వాసులతో ముఖాముఖి మాట్లాడి రోడ్డు పనుల నాణ్యతను, ఎదురవుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, కాలనీ వాసులు పాల్గొన్నారు.






