కొండాపూర్ డివిజన్ పరిధిలో అభివృద్ధి ప‌నుల‌కు శంకుస్థాప‌న‌లు

శేరిలింగంప‌ల్లి, ఫిబ్ర‌వ‌రి 5 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): కొండాపూర్ డివిజన్ పరిధిలోని ప్రేమ్ నగర్ ఎ బ్లాకు, గోల్డెన్ తులిప్, రాజా రాజేశ్వర నగర్, శ్రీరామ్ నగర్ ఎ బ్లాకు, 8వ పోలీస్ బెటాలియన్, కొత్తగూడ కాలనీలలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు పిఏసీ చైర్మన్, ఎమ్మెల్యే గాంధీ, కార్పొరేటర్ హమీద్ పటేల్ శంకుస్థాపన చేశారు. ప్రేమ్ నగర్ ఎ బ్లాకులో రూ.80 లక్షల అంచనా వ్యయంతో కమ్యూనిటీ హాలు నిర్మాణం, గోల్డెన్ తులిప్ కాలనీలో రూ.18 లక్షల‌తో ఓపెన్ జిమ్ నిర్మాణం, రాజా రాజేశ్వర నగర్ కాలనీలో రూ.50 లక్షల‌తో సీసీ రోడ్ల నిర్మాణం, శ్రీరామ్ నగర్ ఎ బ్లాకు కాలనీలో రూ.46 లక్షల‌తో సీసీ రోడ్ల నిర్మాణం, 8వ పోలీస్ బెటాలియన్ లో రూ.89 లక్షల‌తో సీసీ రోడ్ల నిర్మాణం, కొత్తగూడలోని ముస్లిం శ్మ‌శాన వాటిక గోడ నిర్మాణం కోసం రూ.37 లక్షలతో మొత్తంగా రూ.3 కోట్ల 20 లక్షల‌తో చేపట్టబోయే పనులకు శంకుస్థాపన చేశారు. ఈ శంకుస్థాపన కార్యక్రమంలో స్థానిక సీనియర్ నాయకులు, యువ నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here