శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 4 (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ డివిజన్లో రాజీవ్ నగర్ కాలనీ, వెంకటాద్రి కాలనీ లో దోమల సమస్య రోజురోజుకూ తీవ్రమవుతున్న తరుణంలో, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మిర్యాల ప్రీతం తన సొంత ఖర్చులతో దోమల నివారణ ఫాగింగ్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమం వల్ల కాలనీవాసులు ఎంతో ఉపశమనాన్ని పొందారని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి ప్రజాప్రయోజన కార్యక్రమాలు ఎంతో అవసరమని, ఎలాంటి స్వార్థం లేకుండా ముందుకు వచ్చి ఫాగింగ్ నిర్వహించిన మిర్యాల ప్రీతం సేవలు అభినందనీయమని కాలనీవాసులు పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్య భద్రతకే ప్రాధాన్యత ఇస్తూ చేపట్టిన ఈ కార్యక్రమం కాలనీలో మంచి ఫలితాలను ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో యాదియా , కృష్ణ, కాశీ, చిరంజీవి, నాని , సాయి కుమార్, క్రాంతి , విమల చింటూ, త్రిలోచన, గణేష్ , సాయి పవన్ , రాజు, బోస్, రాకేష్ , రూపేష్ , తిరుపతి , సాయి, సన్నీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మిర్యాల ప్రీతంకి కాలనీవాసులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.






