ఆలయ వార్షికోత్సవంలో పాల్గొన్న కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

శేరిలింగంప‌ల్లి, ఫిబ్ర‌వ‌రి 4 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంపల్లి డివిజన్ లోని సురభి కాలనీ అభయాంజనేయ స్వామి, శివాలయం, భ్రమరాంబిక స్వామి ఆలయం 7వ వార్షికోత్స మహోత్సవంలో ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన వితరణ కార్యక్రమంలో పాల్గొని భక్తులకు వడ్డించారు. ఈ సందర్బంగా కార్పొరేటర్ మాట్లాడుతూ.. స్వామి వారి దయతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో విరాజిల్లాలని కోరుకున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో పురం విష్ణువర్ధన్ రెడ్డి, కొయ్యాడ లక్ష్మణ్ యాదవ్, సురభి సంక్షేమ సంఘం అధ్యక్షుడు వెంకట రెడ్డి, వార్డు మెంబర్ శ్రీకళ, సందయ్య నగర్ అధ్యక్షుడు బస్వ‌రాజ్, అభయాంజనేయ స్వామి ఆలయ కమిటీ ప్రెసిడెంట్ విజయానంద్, సెక్రటరీ కోదండరాం, ట్రెజరర్ దుర్గాప్రసాద్, జాయింట్ సెక్రటరీ వేణుమాధవ్, మెంబర్స్ ధనుంజయ, చంద్ర శేఖర్, జయకృష్ణ, భాను, జితేంద్ర, నర్సింహా రెడ్డి, మహిళలు సుధామాలిని, కుమారి, కళ్యాణి, సరిత, లక్ష్మి, స్వాతి, లక్ష్మి, ఉషా, తిరుపతమ్మ, సంగీత, కాలనీవాసులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here