శేరిలింగంపల్లి, జనవరి 28 (నమస్తే శేరిలింగంపల్లి): OC JAC EWS (ఇతర కులాల సంయుక్త కార్యాచరణ కమిటీ – ఎకనామికల్లీ వీక్ సెక్షన్) రాష్ట్ర స్థాయి ఉపాధ్యక్షుడిగా, శేరిలింగంపల్లి నియోజకవర్గ అధ్యక్షుడిగా నూతనంగా నియమితులైన బోయినపల్లి వినోద్ రావుని PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ శాలువాతో సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా వినోద్ రావు నియామకం పట్ల ఆరెకపూడి గాంధీ సంతోషం వ్యక్తం చేశారు. OC JAC EWS ద్వారా ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడంలో ఆయన కీలక పాత్ర పోషిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజల సంక్షేమం కోసం, ముఖ్యంగా ఈడబ్ల్యూఎస్ వర్గాలకు న్యాయం జరిగేలా సంఘటితంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు బాలింగ్ గౌతమ్ గౌడ్, యాదగిరి, శ్రీనివాస్, దయాకర్ రెడ్డి తదితరులు పాల్గొని వినోద్ రావుకి శుభాకాంక్షలు తెలిపారు.






