శేరిలింగంపల్లి, జనవరి 29 (నమస్తే శేరిలింగంపల్లి): ఉదయించే సూర్యుడు మన ఉదయ్ కిరణ్ అన్న రా.. రేవంత్ అన్న, జగదీశ్ అన్న అండగా ఉండేరా, నిస్వార్థ సేవకు నిలువెత్తు రూపం మన అన్న ఉదయ్ కిరణ్.. అనే స్ఫూర్తిదాయక గీతాలను ప్రజాసేవకు అంకితమైన యువ నాయకుడు యలమంచి ఉదయ్ కిరణ్ పై రూపొందించగా, వాటిని శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్, టీపీసీసీ జనరల్ సెక్రటరీ జగదీశ్వర్ గౌడ్ ఆవిష్కరించారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ యువ నాయకుడు, మియాపూర్ డివిజన్ జనరల్ సెక్రటరీ, యలమంచి ఉదయ్ కిరణ్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు యలమంచి ఉదయ్ కిరణ్ సేవా నిబద్ధత, నాయకత్వ ప్రతిభ, ప్రజల పట్ల అంకితభావాన్ని ప్రతిబింబించేలా ఈ గీతాలను రూపొందించినట్లు నిర్మాతలు తెలిపారు. ఈ పాటలను టీమ్ యలమంచి ఉదయ్ కిరణ్, గోకినేపల్లి రమేష్ జన్మదిన సందర్భంగా అంకితం చేశారు. హన్మకొండకు చెందిన ప్రముఖ రచయిత శ్రీకాంత్ రచించిన ఈ గీతాలు యువతలో చైతన్యం నింపేలా, నాయకత్వ విలువలను ప్రతిఫలించేలా రూపుదిద్దుకున్నాయని అన్నారు.

పాటల ఆవిష్కరణ సందర్భంగా మాట్లాడిన ముఖ్య అతిథులు యలమంచి ఉదయ్ కిరణ్ యువతకు ఆదర్శప్రాయ నాయకుడని, ప్రజాసేవనే జీవిత లక్ష్యంగా ముందుకు సాగుతున్న వ్యక్తిత్వమున్న నాయకుడిగా ప్రశంసించారు. ఆయన నాయకత్వం భవిష్యత్ తరాలకు మార్గదర్శకంగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో స్టేట్ జాయింట్ యాక్షన్ కమిటీ ఎకనామికల్ వీకర్ సెక్షన్ వైస్ ప్రెసిడెంట్, శేరిలింగంపల్లి ప్రెసిడెంట్ వినోద్ రావు, జి వి రెడ్డి, యలమంచి ఉదయ్ కిరణ్ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు, టీమ్ యలమంచి, రాచమల్ల భాస్కర్ గౌడ్, బండి రామకృష్ణ, రాధాకృష్ణ, గోకినేపల్లి రమేష్, కామినేని శ్రీనివాసు, రత్నాచారి, సతీష్, నాగ సాయి, బొబ్బా సాయి తదితరులు పాల్గొన్నారు.






