రూ.79 కోట్ల 58 లక్షలతో నాలాల విస్తరణ పనులు: PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ

శేరిలింగంప‌ల్లి, జ‌న‌వ‌రి 24 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): చందానగర్ డివిజన్ పరిధిలోని దీప్తి శ్రీ నగర్ నాలా విస్తరణ పనులలో భాగంగా అసంపూర్తిగా మిగిలిపోయిన నాలా విస్తరణ నిర్మాణం పనులను SNDP ఇంజనీరింగ్ విభాగం అధికారులు, సీనియర్ నాయకుడు రఘునాథ్ రెడ్డితో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ పరిశీలించారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ SNDP ఫేజ్‌ 2 లో శేరిలింగంపల్లి నియోజకవర్గంలో రూ.79 కోట్ల 58 లక్షల అంచనా వ్యయంతో నాలాల విస్తరణ పనులు చేపట్టడంతో ఎన్నో ఏండ్ల వరద ముంపు సమస్య కు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. దీప్తి శ్రీ నగర్ కాలనీ లో నాలా విస్తరణ పనులలో భాగంగా అసంపూర్తిగా మిగిలిపోయిన నాలా విస్తరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు. త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో కి తీసుకురావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో DE ధీరజ్, నాయకులు రఘునాథ్ రెడ్డి, ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ , గౌతమ్ గౌడ్, ప్రవీణ్ రెడ్డి, సుదేశ్, సీతారామయ్య, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here