నేడు ప‌లు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేత

శేరిలింగంపల్లి, జ‌న‌వ‌రి 19 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): చెట్లు తొలగింపు (ట్రీ కట్టింగ్) పనుల కారణంగా 20 జనవరి 2026, మంగళవారం నాడు శేరిలింగంపల్లిలోని ప‌లు ప్రాంతాల్లో తాత్కాలికంగా విద్యుత్ సరఫరాను నిలిపివేయనున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. 33/11 కెవి వికాస్ సబ్ స్టేషన్ నుంచి సరఫరా అయ్యే 11 కెవి కేంద్రీయ విహార్ ఫీడర్ పరిధిలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుంది. ఈ సమయంలో కేంద్రీయ విహార్, మయూరి నగర్, క్రికెట్ గ్రౌండ్ పరిసర ప్రాంతాల‌లో క‌రెంటు ఉండ‌ద‌ని అధికారులు వెల్లడించారు. అదేవిధంగా 33/11 కెవి మయూరి నగర్ సబ్ స్టేషన్ నుంచి సరఫరా అయ్యే 11 కెవి ప్రశాంత్ నగర్ ఫీడర్ పరిధిలో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నారు. ఈ సమయంలో ప్రశాంత్ నగర్, మయూరి నగర్‌లోని కొన్ని ప్రాంతాలు, ఎస్‌బీఐ బ్యాంక్ రోడ్, వాటర్ ట్యాంక్ ప్రాంతం, జీఎల్‌ఆర్ కాలనీ ఓల్డ్ ఏజ్ హోమ్, ఇంద్రిమ్మ కాలనీ ఫేజ్–1, వెంకట్రాయ నగర్ ప్రాంతాలు ప్రభావితమవుతాయని తెలిపారు. ఈ తాత్కాలిక అసౌకర్యానికి ప్రజలు సహకరించాలని విద్యుత్ శాఖ అధికారులు కోరారు. మరిన్ని వివరాలకు AE/OP/హైదర్‌న‌గర్ కార్యాలయం (ఫోన్ నంబర్: 8712472699) లో సంప్రదించాలని సూచించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here