అఖిల భారత యాదవ మహాసభ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశం

శేరిలింగంపల్లి, జ‌న‌వ‌రి 19 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): అఖిల భారత యాదవ మహాసభ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని, 2026 క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని రాష్ట్ర అధ్యక్షుడు చింతల రవీంద్రనాథ్ యాదవ్ ఆధ్వర్యంలో హోటల్ మహారాజాలో నిర్వహించారు. ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న బీసీ కులాల ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు భేరి రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ యాదవ సంఘాలన్నీ ఏకతాటిపైకి వచ్చి బీసీ సంఘాలతో కలిసి ఐక‌మత్యంతో రాబోయే ఎంపీటీసీ, జడ్పిటిసి, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నిక‌ల్లో కార్పొరేటర్ గా, కౌన్సిలర్ గా, చైర్మన్ గా, ఎంపిటిసి, జడ్పిటిసి గా పెద్ద సంఖ్యలో గెలు పొందాలని, రాబోయే రోజుల్లో యాదవులు, బీసీలు రాజకీయంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు పెరుగు ఐలేష్ యాదవ్, వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు జింకల యాదయ్య యాదవ్, సర్పంచ్ శ్రీనివాస్ యాదవ్, జాతీయ సంరక్షకుడు బద్దుల బాబు రావు యాదవ్, ఉస్మానియా యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ డా. డి. రవీందర్ యాదవ్ పాల్గొన్నారు. గ్రేటర్ హైదరాబాద్ మహిళా విభాగం అధ్యక్షురాలిగా వనం సంగీత యాదవ్, మేడ్చల్ జిల్లా యువజన అధ్యక్షుడిగా బత్తుల లక్ష్మి నారాయణ యాదవ్, రాష్ట్ర మాజీ సైనికుల విభాగం అధ్యక్షుడిగా జక్కుల శ్రీనివాస్ యాదవ్ నియామ‌కం అయ్యారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here