శేరిలింగంపల్లి, జనవరి 18 (నమస్తే శేరిలింగంపల్లి): జ్యోతిర్లింగక్షేత్రంమైన శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి సమేత శ్రీశైల దేవస్థానంలో మకరసంక్రాంతి బ్రహ్మోత్సవల్లో చివరి రోజు స్వామి వారిని పలువురు బీజేపీ నాయకులు దర్శించుకుని స్పర్శ దర్శనం చేసుకున్నారు. దర్శనం చేసుకున్న వారిలో బీజేవైఎం రాష్ట్ర నాయకుడు నందనం విష్ణు దత్త్, బీజేపీ మదీనాగూడ డివిజన్ ప్రధానకార్యదర్శి రాజు ముదిరాజ్, మాజీ కౌన్సిలర్ రమణయ్య, మాజీ డిప్యూటీ కలెక్టర్, బీజేపీ సీనియర్ నాయకుడు పి. సత్యనారాయణ రాజు, పాలం శ్రీనివాస్ యాదవ్, శివ ముదిరాజ్, అమర్నాథ్ రెడ్డి, వెంకటేష్ ముదిరాజ్ పాల్గొన్నారు.






