సోమనాథ్ స్వాభిమాన్ సంకల్ప యాత్ర లో ప్రతి ఒక్క‌రు పాల్గొనాలి: రవికుమార్ యాదవ్

శేరిలింగంప‌ల్లి, జ‌న‌వ‌రి 10 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): సోమనాథ్ ఆలయం నిర్మించి 75 ఏళ్ళు పూర్తవుతున్న సందర్భంగా గచ్చిబౌలి డివిజన్, గౌలిదొడ్డి శివాలయంలో నిర్వహించిన ఓంకార జపం , విశేష పూజలలో బీజేపీ శేరిలింగంపల్లి అసెంబ్లీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే, ఇంఛార్జి రవికుమార్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయ‌న మాట్లాడుతూ 1000 ఏళ్ల క్రితం 1025 లో గజిని మహ్మద్ దాడి చేసి సోమనాథ్ ఆలయాన్ని కూల్చి వేశారని , భారతదేశ ఆధ్యాత్మిక, సాంస్కృతిక గౌరవానికి ప్రతీకగా , శివభక్తుల అచంచల విశ్వాసం, సంకల్పంతో తిరిగి 1951 లో 75 సంవత్సరాల క్రితం ఈ పవిత్ర క్షేత్రం నిర్మించారని అన్నారు. మన దేశ సంస్కృతి, శైవ సంప్రదాయం, శివభక్తుల సంకల్పబలం ఎప్పటికీ ఓడిపోలేదని చాటిచెప్పే మహత్తర చిహ్నమే సోమనాథ్ ఆలయమని అన్నారు. ప్ర‌ధాని మోదీ ప్రారంభించబోయే సోమనాథ్ స్వాభిమాన్ సంకల్ప యాత్ర లో ప్రతి ఒక్క‌రు పాల్గొనాలని కోరారు. బీజేపీ బీజేపీ నాయకులు , కార్యకర్తలు ప్రతి కాలనీ, బస్తీ, డివిజన్ల లోని శివాలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించి, సంకల్పయాత్రకు మద్దతు తెలుపుతూ, మన ధర్మం గొప్పదనాన్ని, ఆలయ చరిత్రను ప్రజలందరికీ తెలియజేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకుడు వసంత్ యాదవ్, డివిజన్ అధ్యక్షుడు శివా సింగ్, నాయకులు వరలక్ష్మీ ధీరజ్, కిషన్ గోలి, ఉదయ లక్ష్మీ, రేవతి, సాయి , అమన్, బబ్లూ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here