శేరిలింగంపల్లి, జనవరి 7 (నమస్తే శేరిలింగంపల్లి): కూకట్పల్లి కోర్టులో టిపిసిసి లీగల్ సెల్ స్టేట్ కన్వీనర్ కనకమామిడి సురేందర్ గౌడ్ ఆధ్వర్యంలో కూకట్పల్లి కోర్టుకు సంబంధించిన టీపీసీసీ లీగల్ సెల్ కమిటీని ప్రకటించారు. కమిటీ సభ్యులుగా వసంత రావు, డేవిడ్ రాజు, రాంబాబు, కోటి లింగం, శివ కుమార్ గౌడ్, జి.శ్రీనివాస్, సంజయ్ గౌడ్, ఉదయ్ నారాయణ, ఎం.సంతోష్, కిరణ్ కుమార్, శ్రీను, పి.విజయ్ కుమార్, నెనావత్ భీక్యా, సత్యనారాయణ మూర్తి, ఎ.చంద్రమౌళి, చంద్రకాంత్, ప్రవీణ్ రెడ్డి, ఎం.ఓంకార్ గౌడ్, గుండేటి అఖిల్, దశరథ్ గౌడ్, పి.సురేందర్ గౌడ్లను నియమించారు. అలాగే మహిళా సభ్యులుగా బీవీఎన్ఎల్ లత, ఎం.లావణ్య, పి.అపర్ణ, నాగ లక్ష్మి, అఖిలా రావు, జి.కల్యాణి, కల్యాణి, జయశ్రీ, సులోచన, రాజేశ్వరి, సుమితా యాదవ్, మానసలను నియమించారు. ఈ మేరకు కమిటీ చైర్మన్ పొన్నం అశోక్ గౌడ్ ప్రకటన విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, న్యాయవాదులు పాల్గొన్నారు.






