వెంట‌నే విద్యాశాఖ‌కు మంత్రిని ఏర్పాటు చేయాలి: ఏఐఎస్ఎఫ్

శేరిలింగంప‌ల్లి, జ‌న‌వ‌రి 7 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) శేరిలింగంపల్లి మండలం మసీద్ బండ కొండాపూర్ లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో 15 సంవత్సరాల నుంచి ఖాళీగా ఉన్న (జి హెచ్ ఎం) గెజిటెడ్ హెడ్ మాస్టర్ పోస్ట్ ని వెంటనే నియమించాలని డిమాండ్ చేసింది. రోజురోజుకీ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల‌కు మధ్యాహ్న భోజన పథకం విఫ‌ల‌మ‌వుతుంద‌ని, విద్యార్థులు 20 నుంచి 30 శాతం మాత్రమే భోజనం తింటున్నార‌ని అన్నారు. మిగితా విద్యార్థులు ఇంటి భోజనం తెచ్చుకుంటున్నారని, క్లాస్ రూమ్ లో కొత్త లైట్స్, ఫాన్స్ పెట్టాల‌ని, టాయిలెట్స్ ని ఎప్పుడూ శుభ్రంగా ఉంచాల‌ని, 24 గంటలు నీళ్లు వదలాల‌ని అన్నారు. స్కూల్ ఎదుట ఒక వాచ్‌మెన్‌ను ఏర్పాటు చేయాల‌ని, లేక‌పోతే విద్యార్థులు పాఠ‌శాల స‌మ‌యాల్లో బ‌య‌ట‌కు వెళ్తున్నార‌ని అన్నారు. ప్రభుత్వం వెంటనే విద్యాశాఖకు మంత్రిని నియమించాలని, విద్యార్థులకు న్యాయం జరిగే వరకూ పోరాటం ఆగద‌ని అన్నారు. ఏఐఎస్ఎఫ్ శేరిలింగంపల్లి మండల‌ అధ్యక్షుడు టి.నితీష్ , కార్యదర్శి జె. ధర్మతేజ పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here