శేరిలింగంపల్లి, డిసెంబర్ 29 (నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్ శిల్పారామంలో నిర్వహిస్తున్న ఆలిండియా క్రాఫ్ట్ మేళా సందర్భంగా ఏర్పాటు చేసిన హస్తకళా ఉత్పత్తులు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా శివ స్వరూప్ వయొలిన్ కచేరి, US నుండి విచ్చేసిన శ్వేతా రవిశంకర్ భరతనాట్య ప్రదర్శన, ఆర్తి శంకర్ కథక్ నృత్య ప్రదర్శన అలరించింది. సౌత్ జోన్ కల్చరల్ సెంటర్ తంజావూర్ వారు పంపించిన ఒరిస్సా నుండి విచ్చేసిన సంబల్పూరి నృత్య కళాకారుడు శశాంక్ శర్మ బృంద ప్రదర్శన సందర్శకులను ఆకట్టుకుంది.






