శేరిలింగంపల్లి, డిసెంబర్ 29 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ మక్తా మహబూబ్ పేట్ సర్వేనెంబర్ 44లో ఎలాంటి అనుమతులు లేకుండా అనేక అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని, వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రజావాణిలో శేరిలింగంపల్లి బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు తౌట్ రెడ్డి సంతోష్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోర్టు నోటీసులతో జిహెచ్ఎంసి అధికారులు సీజ్ చేసిన బిల్డింగులను సీజింగ్ బోర్డులు, బెల్టులు తొలగించి నిర్మాణాలు చేపడుతున్నారని, GHMC అధికారులు వారి దగ్గర మామూళ్లు తీసుకొని వదిలేస్తున్నారని, దీంతో ఎలాంటి భయం లేకుండా సీజింగ్ బోర్డు తొలగించి యథేచ్ఛగా భవన నిర్మాణాలను పూర్తి చేస్తున్నారని అన్నారు. తాము ఎన్ని ఫిర్యాదులు చేసినా, కోర్టు ఆర్డర్లు ఉన్నా జిహెచ్ఎంసి అధికారులు వాటన్నింటినీ పక్కనపెట్టి బిల్డర్లకు దాసోహం అంటున్నారని అన్నారు. తక్షణమే ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని ప్రజావాణిలో ఇచ్చిన ఫిర్యాదులను బుట్ట దాఖలు చేయకుండా వారందరిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరారు.






