ఆర్ కే వై ఫౌండేషన్ సేవ‌లు అభినంద‌నీయం: ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి

శేరిలింగంప‌ల్లి, డిసెంబ‌ర్ 23 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): పేద విద్యార్థులు బాగా చదువుకోవాలనే లక్ష్యంతో గత కొన్ని సంవత్సరాలుగా ఆర్ కే వై ఫౌండేషన్ ఆధ్వర్యంలో శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల‌లో చదువుకునే పదవ తరగతి విద్యార్థినీ విద్యార్థులకు నిపుణుమైన ఉపాధ్యాయుల సలహాలు సూచనలతో ప్రత్యేకంగా తయారు చేయించిన ఆలిన్ వన్ స్టడీ మెటీరియల్ ను ఉచితంగా ఫౌండేషన్ చైర్మన్ రవి కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో అందజేస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా లింగంపల్లి జడ్. పి. హెచ్. హైస్కూల్ బాలికల పాఠశాలలో దాదాపు 400 మంది విద్యార్థినిలకు పార్లమెంటు సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మాజీ శాసనసభ్యుడు బిక్షపతి యాదవ్ చేతుల మీదుగా స్టడీ మెటీరియల్ అందజేశారు. ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ రాజకీయరంగంలో ఎంతోమంది పేదవారికి సహాయ సహకారాలు అందించిన భిక్షపతి యాదవ్ కుటుంబం విద్యారంగంలో కూడా వారికి తోచిన సహాయం ప్రతి ఏటా ప్రభుత్వ పాఠశాలలో ఏదో ఒక కార్యక్రమం ద్వారా విద్యార్థుల భవిష్యత్తు బాగుండాలని, వారు ఉన్నత చదువులు చదువుకుని సమాజానికి, వారి కుటుంబానికి మంచి పేరు తీసుకొస్తారనే సదుద్దేశంతో ఉచితంగా పదవ తరగతి చదువుకునే విద్యార్థినిలకు స్టడీ మెటీరియల్ అందించడం అభినందించే విషయం అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు సుభాష్ చంద్ర రెడ్డి, బల్వంత్ రెడ్డి, నాయకులు బుచ్చిరెడ్డి , వసంత్ యాదవ్, ఎల్లేష్, రామరాజు, కేశవ్, మనోహర్, లక్ష్మణ్, కిషోర్ , రాజు శెట్టి, శ్రీనివాస్ రెడ్డి , రామ్ రెడ్డి, సునీల్ రెడ్డి, హనుమంతు నాయక్ , గోపాల్ రావు, సీతారామరాజు, వెంకటేష్ , నర్సింగ్ రావు , రాజేష్ గౌడ్, గణేష్, జితేందర్, వినోద్ యాదవ్ , సోమయ్య, బాబు , వీరు యాదవ్ , రాము, శ్రీనివాస్, వేణు, అజయ్, పద్మ, విజయలక్ష్మి, జ్యోతి, లక్ష్మీ , భాగ్యశ్రీ, మీనమ్మ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here