శేరిలింగంపల్లి, డిసెంబర్ 23 (నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్ డివిజన్ పరిధిలోని మాధవ నగర్ కాలనీ ( మియాపూర్ చౌరస్తా)లో నూతనంగా ఏర్పాటు చేసిన ఇందిరమ్మ క్యాంటీన్ లో 5 రూపాయలకే ఆల్ఫాహారం పథకంను DC శశిరేఖ, కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, ప్రాజెక్ట్ ఆఫీసర్ విజయలక్ష్మి, AMOH రవి కుమార్, సీనియర్ నాయకుడు రఘునాథ్ రెడ్డితో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ ఇందిరమ్మ క్యాంటీన్లలో నేటితో రుచికరమైన టిఫిన్ కూడా అందుబాటులోకి రానుంది అని, పేదలు ఉదయం పూట అర్థ ఆకలి తో ఉండకూడదు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెద్ద మనస్సుతో అల్పాహారం పథకం ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. ప్రతిరోజూ ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు ఇడ్లీ, పూరీ, వడ, ఉప్మా, పొంగల్ వంటి టిఫిన్లను ప్రజలకు అందించనున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు, కార్యకర్తలు, కాలనీల వాసులు తదితరులు పాల్గొన్నారు.






