నవ భారత్ నగర్ కాలనీ స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి కృషి: PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ

శేరిలింగంప‌ల్లి, డిసెంబ‌ర్ 22 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మాదాపూర్ డివిజన్ పరిధిలోని నవ భారత్ నగర్ కాలనీ వాసులు పలు సమస్యలు, చేపట్టవలసిన పలు అభివృద్ధి పనుల పై సీనియర్ నాయకుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీని వివేకానంద నగర్ లోని ఆయ‌న‌ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం సమర్పించారు. దీనిపై PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా నవ భారత్ నగర్ కాలనీ వాసులు మాట్లాడుతూ కాలనీ లో అంపూర్తిగా మిగిలిపోయిన రోడ్ల ను పూర్తి చేయాలని కోరారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ త్వరలోనే నవ భారత్ నగర్ లో పర్యటిస్తానని, త్వరలోనే రోడ్డు పనులను ప్రారంభిస్తామని, కాలనీ లో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here