శేరిలింగంపల్లి, డిసెంబర్ 22 (నమస్తే శేరిలింగంపల్లి): కేరళలోని కొచ్చిన్‌లో 28వ ఆలిండియా లాయర్స్ క్రికెట్ టోర్నమెంట్‌ను నిర్వహిస్తున్నట్లు తెలంగాణ హై కోర్టు లాయర్స్ క్రికెట్ అసోసియేషన్ ఒక ప్రకటనలో తెలిపింది. డిసెంబర్ 23 నుంచి 28వ తేదీ వరకు జరగనున్న ఈ టోర్నమెంట్‌లో సుప్రీం కోర్టు, అలహాబాద్ హై కోర్టు, ఢిల్లీ హైకోర్టు, కర్ణాటక హైకోర్టు, తెలంగాణ హైకోర్టు, కేరళ హైకోర్టు, తమిళనాడు హైకోర్టు, ఒరిస్సా హైకోర్టు, పంజాబ్ హర్యానా హై కోర్టు, పుదుచ్చేరి మహారాష్ట్ర హైకోర్టుకు చెందిన లాయర్స్ క్రికెట్ అసోసియేషన్ సభ్యులు పాల్గొంటారని తెలిపారు. ఈ టోర్నమెంట్‌లో పాల్గొనేందుకు గాను తెలంగాణ హైకోర్టు లాయర్స్ క్రికెట్ అసోసియేషన్ నుంచి 16 మంది జట్టు సభ్యులను ఎంపిక చేసినట్లు వివరించారు. కెప్టెన్‌గా కె.సునీల్ గౌడ్ ను ఎంపిక చేశామని, జట్టులో రఘువీరా రెడ్డి, రాజ గోపాల్ రెడ్డి, ఎం. గోవింద్ రెడ్డి, పవన్ కుమార్ ఆదిత్య, ఖలీద్ బిన్ సయ్యద్, సుమన్ గౌడ్, సయ్యద్ మన్సూర్, రాహుల్ తపాడియా, మనోజ్, ఉన్నం కృష్ణ, ఓవైసీ, సాయి చంద్, ఎండీ అబ్దుల్ మతిన్ ఖురేషీ, మనోహర్, షెయిద్ ఇతర సభ్యులుగా ఆడనున్నారని తెలిపారు. ఈ జట్టుకు కోచ్‌గా పి.బాలగోపేందర్‌నాథ్ వ్యవహరించనుండగా, మేనేజర్‌గా వి.కిరణ్ కుమార్, అసిస్టెంట్ మేనేజర్‌గా ఇ.వరుణ్ కుమార్ వ్యవహరించనున్నారని తెలిపారు.






