మొక్క‌ల‌ను ర‌క్షించే బాధ్య‌త కూడా మ‌న‌దే: మాజీ కార్పొరేటర్ నవత రెడ్డి

శేరిలింగంపల్లి, డిసెంబ‌ర్ 20 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా చందానగర్ లోని అయ్యప్ప స్వామి దేవాలయంలో అయ్యప్ప భక్తులతో కలిసి మాజీ కార్పొరేటర్ నవత రెడ్డి, గురుస్వామి సత్యం, ప్రసాద్ స్వామి మొక్కలు నాటారు. ఈ సంద‌ర్భంగా నవతా రెడ్డి, ప్రసాద్ స్వామి మాట్లాడుతూ మొక్కలు నాటే పవిత్ర కార్యక్రమంలో అయ్యప్ప స్వాములతో కలిసి పాల్గొనడం చాలా ఆనందంగా ఉంద‌న్నారు. మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యతగా చేపట్టాలని, మొక్కలు పెట్టడమే కాదు వాటిని రక్షించే బాధ్యత కూడా మన యువతరం మీద ఉంద‌న్నారు. రేపటి తరాలకు మనం ఇచ్చే ఆస్తి మంచి వాతావరణం అని అన్నారు. ఇంతటి గొప్ప అవకాశం కల్పించిన మాజీ రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రాష్ట్ర కో ఆర్డినేటర్ గర్రెపల్లి సతీష్, శ్రీకాంత్, మల్లారెడ్డి, సంగారెడ్డి, నగేష్ రెడ్డి, రాజు, సునీత, అనంత్ రెడ్డి, అయ్యప్ప స్వాములు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here