శేరిలింగంపల్లి, డిసెంబర్ 12 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ లోని జిఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియంలో శేరిలింగంపల్లి మండల రికగ్నైజ్డ్ ప్రైవేట్ స్కూల్ కరెస్పాండంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్పోర్ట్స్ మానియా కార్యక్రమంలో శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా స్పోర్ట్స్ ఫ్లాగ్ ను ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు. ఈ సందర్బంగా విద్యార్థులతో కలిసి స్పోర్ట్స్ లో పాల్గొని వారిని ఉత్సాహపరిచారు. అనంతరం విద్యార్థులు అనేక క్రీడలలో సాంస్కృతిక కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. అన్ని ఆటలకు, అన్ని రంగాలకు సమాన ప్రాధాన్యం ఇచ్చిన విధానం ఎంతో ప్రశంసనీయమని కార్పొరేటర్ అభినందించారు.

ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ఒకే వేదికపై ఎన్నో విభిన్న క్రీడా సాంస్కృతిక కార్యక్రమాలు అందుబాటులో ఉండటం అత్యంత అభినందనీయమని విద్యార్థుల అభివృద్ధికి ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరం అని పేర్కొన్నారు. క్రీడలతో మానసిక వికాసం సాధ్యమవుతుందన్నారు. శిక్షణ పట్టుదలతో ముందుకు సాగి రాష్ట్రస్థాయి నుండి జాతీయ స్థాయి క్రీడల్లో రాణించాలని విద్యార్థులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి మండల రికగ్నైజ్డ్ ప్రైవేటు స్కూల్ కరస్పాండెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఏ.ఆర్.పవన్ కుమార్, సీనియర్ నాయకులు యాదా గౌడ్, జనరల్ సెక్రెటరీ త్రిమూర్తులు, ట్రెజరర్ సలీం, వైస్ ప్రెసిడెంట్ వెంకటేశ్వరరావు, వైస్ ప్రెసిడెంట్ సూర్యనారాయణ, విజయ్ కుమార్, నాని బాబు, జాయింట్ సెక్రెటరీ శ్రీనివాస్ రెడ్డి, జితేందర్ గణేష్, కల్చరల్ సెక్రెటరీ శైలజ, సుజీవన్ బాబు, సుస్మిత, పురుషోత్తం, ఆర్గనైజింగ్ సెక్రటరీలు విజయ్, సురేష్ బాబు, కాజా హాబీబుద్దీన్, స్పోర్ట్స్ సెక్రెటరీస్ కమలేష్, అభిషికిత్, వీరేష్ కుమార్, కమ్యూనికేషన్ సెక్రెటరీస్ సైమన్, ప్రాధ్యుమ్న కుమార్, దేవానందం, భానుచందర్, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ సత్యనారాయణ, స్వాములు, సంతోష్ కుమార్, విద్యార్థినీ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.





