శేరిలింగంపల్లి, డిసెంబర్ 12 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లిలోని మసీద్ బండ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ మాజీ నాయకుడు సత్యనారాయణ 26వ వర్ధంతి సందర్భంగా ఆయన తనయులు, కుటుంబ సభ్యులు ఘనంగా నివాళులు అర్పించారు. ఆయన ద్వితీయ కుమారుడు మారబోయిన అనిల్ కుమార్ యాదవ్, సోదరుడు, శేరిలింగంపల్లి నియోజకవర్గం మాజీ శాసనసభ్యుడు ఎం. భిక్షపతి యాదవ్ తోపాటు వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరై ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ సత్యనారాయణ సేవా సమితి పేరున తాను చేస్తున్న అనేక సేవా కార్యక్రమాలను వివరించారు. సత్యనారాయణ భౌతికంగా మనకు దూరమైన ప్రజల సత్తన్నగా కుమారుడిగా ఆయన ఆశయ సాధనకు కృషి చేస్తానని తెలిపారు.






