పార్లమెంట్ లో బీసీ బిల్లు పెట్టకుండా వస్తే ఎంపీలారా ఖబర్దార్: బీసీ పొలిటికల్ ఫ్రంట్

శేరిలింగంపల్లి, డిసెంబ‌ర్ 10 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): బీసీ పొలిటికల్ ఫ్రంట్ రాష్ట్ర కార్యాలయం చిక్కడపల్లిలో జరిగిన విలేకరుల సమావేశంలో పొలిటికల్ ఫ్రంట్ ఛైర్మ‌న్ బాలగౌని బాలరాజ్ గౌడ్ మాట్లాడుతూ పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమై నేటికి 10 రోజులు కావస్తున్న 42 శాతం బీసీ రిజర్వేషన్స్ బిల్లుపై తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంట్ సభ్యులు ఎందుకు నోరుమేదపడం లేదని, రిజర్వేషన్ల పై కాంగ్రెస్ పార్టీ వైఖరి ఏంటని ప్రశ్నించారు. రెండు సంవత్సరాల విజయోత్సవాల మీద తెలంగాణ రైజింగ్ సమ్మిట్ మీద ఉన్న చిత్తశుద్ధి బీసీ రిజర్వేషన్ల మీద ఎందుకు లేదని, ఇప్పటికైన అఖిలపక్ష సమావేశం నిర్వహించి డిల్లీకి తీసుకెళ్ళాలిసి ఉన్నపటికీ ఎలాంటి కార్యాచరణ లేకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు ఎందుకు మౌనం వహిస్తున్నారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.

42 శాతం రిజర్వేషన్లతో స్థానిక ఎన్నికలు నిర్వహిస్తానన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు నీటి మూటలేనా అని, బీసీ రిజర్వేషన్లు అమలు చేసి దేశానికి రోల్ మోడల్ అన్న ముఖ్యమంత్రి సర్పంచ్ ఎన్నికలకు మంగళం పాడి అభివృద్ధి పేరుతో నాటకాలు ఆడుతున్నార‌ని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ పొలిటికల్ ఫ్రంట్ వైస్ చైర్మన్ దుర్గయ్య గౌడ్ , రాష్ట్ర కన్వీనర్లు అయిలి వెంకన్న గౌడ్, బైరూ శేఖర్ , ఎలికట్టె విజయ్ కుమార్ గౌడ్ , అంబాల నారాయణ గౌడ్ , బోయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బోయ గోపి , ఎంబీసి విద్యార్థి సంఘం అధ్యక్షుడు బదేసాబ్, సిటీ సెక్రటరీ పిల్లి శంకర్ , గంగపుత్ర సిటీ వైస్ ప్రెసిడెంట్ గాలి సత్యనారాయణ , గంగపుత్ర సంఘం అధ్యక్షుడు సురేష్ , ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here