శేరిలింగంపల్లి, డిసెంబర్ 6 (నమస్తే శేరిలింగంపల్లి): బాబా సాహెబ్ డా. బీఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్బంగా కొండాపూర్ డివిజన్ పరిధిలోని సిద్దిక్ నగర్ బస్తిలోని అంబేద్కర్ కూడలి వద్ద ఉన్న బాబా సాహెబ్ డా. బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ స్థానిక నాయకులతో కలసి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా కార్పొరేటర్ హమీద్ పటేల్ మాట్లాడుతూ డా బీ ఆర్ అంబేద్కర్ వర్దంతిని ఏటా మహాపరినిర్వాన్ దివస్ గా జరుపుకుంటున్నామని అన్నారు. దేశంలోని అణగారిన వర్గాల ఆర్ధిక, సామాజిక సాధికారికతకు అంబేడ్కర్ చివరి వరకూ పోరాటం చేశారన్నారు. రాజ్యాంగ పరిషత్తు సభ్యునిగా అంబేడ్కర్ విశేషంగా కృషి చేసి రాజ్యాంగ రచనలో ప్రముఖ పాత్ర వహించారన్నారు. ఈ కార్యక్రమంలో సిద్దిక్ నగర్ కాలనీ అధ్యక్షుడు బుడుగు తిరుపతి రెడ్డి, మాజీ అధ్యక్షుడు కాలే బసవ రాజు, సీనియర్ నాయకులు నందు, గణపతి, భాస్కర్, రవీందర్ రెడ్డి, దిలీప్, విష్ణు వర్ధన్ రెడ్డి, సాయి, రాజు, కుమార్, వినోద్, కేశవరావు, రేఖ, మణెమ్మ, సరోజినీ రెడ్డి, రాము యాదవ్, యాదగిరి యాదవ్, విజయ్, కచ్చావ దీపక్ తదితరులు పాల్గొన్నారు.






