శేరిలింగంపల్లి, డిసెంబర్ 6 (నమస్తే శేరిలింగంపల్లి): డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా చందానగర్‌లోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వద్ద బీజేపీ రాష్ట్ర నాయకుడు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి ఘనంగా నివాళులు అర్పించారు. ఆ మహానుభావుడి సేవలను స్మరించుకుంటూ పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర నాయకుడు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ డాక్టర్ అంబేద్కర్ చూపించిన సమానత్వం, న్యాయం, ప్రజాస్వామ్య విలువలను కొనసాగించేందుకు మనందరం కట్టుబడి ఉండాలని, ఆయన ఆశయాలను నెరవేర్చడం మనందరి బాధ్యత అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హఫీజ్‌పేట్ డివిజన్ ప్రధాన కార్యదర్శి రాజు ముదిరాజ్, బీజేపీ నాయకులు పవన్, పాలెం శ్రీనివాస్, నవీన్, సురేందర్, శివ ప్రసాద్, సాయి చరణ్ గౌడ్, చందు, శ్రీకాంత్, ముబీన్ తదితరులు పాల్గొన్నారు.






