ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన హామీల‌ను కాంగ్రెస్ ప్రభుత్వం వెంట‌నే అమ‌లు చేయాలి: మాధవరెడ్డి

శేరిలింగంప‌ల్లి, డిసెంబ‌ర్ 6 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన తెలంగాణ రాష్ట్ర మంత్రుల వైఖరిని నిరసిస్తూ జనసేన పార్టీ శేరిలింగంపల్లి నియోజకవర్గ ఇంచార్జి మాధవరెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న జనసేన శ్రేణులను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయగా వారి ప్రవర్తనకు వ్యతిరేకంగా జనసేన పార్టీ జెండాకు పాలాభిషేకం చేసి పవన్ క‌ళ్యాణ్ కి దిష్టి తీశారు. ఈ సందర్భంగా మాధవరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేకత విధానాలను నిరసిస్తూ ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు.

రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతో సానుకూల వాతావరణంలో ముందుకు సాగుతున్న తరుణంలో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య ప్రాంతీయ విభేదాలు సుృష్టించే కార్యక్రమాలను చేయవద్దని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ జనసేన పార్టీ ఇంచార్జి నందగిరి సతీష్, వివిధ డివిజన్ల అధ్యక్షులు, అరుణ్, సరోజ్ ప్ర‌దీప్, ప్రవీణ్ సాహు, హరినాయక్, రాజేష్, శ్రీకాంత్, రవితేజ, శ్రావణ్, సాయికృష్ణ, శ్రీను, సుధాకర్, లక్ష్మీ నారాయణ, పుష్పలత, వెంకట లక్ష్మి, పద్మజ, జన సైనికులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here