సీఎం రిలీఫ్ ఫండ్ స‌హాయం అంద‌జేత

శేరిలింగంప‌ల్లి, డిసెంబ‌ర్ 6 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని వెంకటేశ్వర నగర్ కాలనీకి చెందిన శ్రీ సాయిలు అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం సీఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేసుకోగా ముఖ్యమంత్రి సహాయనిధి CMRF LOC ద్వారా మంజూరైన రూ.1,10,000 ఆర్థిక సహాయానికి సంబందించిన CMRF – LOC మంజూరు పత్రాన్ని కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావుతో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ బాధిత కుటుంబానికి అంద‌జేశారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి పేద ప్రజలకు గొప్ప వరం అని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేదల పక్షపాతి అని, ముఖ్యమంత్రి సహాయ నిధి నిరంతరం సేవలను అందిస్తూ ఆపదలో ఉన్న వారిని ఆపన్న హస్తంలా ఆదుకుంటున్నదని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు బ్రిక్ శ్రీనివాస్ , జిల్లా గణేష్, గుమ్మడి శ్రీనివాస్, సాంబయ్య, శ్రీనివాస్ చౌదరి, రవి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here