డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కు కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ నివాళులు

శేరిలింగంప‌ల్లి, డిసెంబ‌ర్ 6 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): రాజ్యాంగ నిర్మాత, భారత రత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్బంగా శేరిలింగంపల్లి డివిజన్ లోని రాజీవ్ గృహకల్ప సెంటర్ లో అంబేద్కర్ విగ్రహానికి శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్బంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యానికి పునాది వేసి, సమాజానికి అనేక హక్కులను అందించిన అంబేద్కర్ స్ఫూర్తిని స్మరించుకుందామ‌ని అన్నారు. జోహార్ అంబేద్కర్, కొనసాగిస్తాం అంబేద్కర్ ఆశయాలను అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో వార్డ్ మెంబర్ శ్రీకళ, జయ, హరి, కుమారి, కళ్యాణి, దేవి, నరసింహా రావు, రెడ్డి, స్థానికవాసులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here