శేరిలింగంపల్లి, డిసెంబర్ 6 (నమస్తే శేరిలింగంపల్లి): అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా శేరిలింగంపల్లి నియోకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి మాధవ రెడ్డి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అట్టడుగు వర్గాల ప్రజలకు రాజ్యాంగ ఫలితాలు అందించాలని రాజ్యాంగ రూపకల్పనలో అంబేడ్కర్ విశేష కృషిని చేశారని కొనియాడారు. ఆయన ఆశయాలను సాధించే విధంగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నిత్యం కృషి చేస్తుండటం అందుకు నిదర్శనమని తెలియజేశారు. అట్టడుగు వర్గాల ప్రజలకు రాజ్యాంగ ఫలాలు అందించే వరకు జనసేన పార్టీ పోరాటం చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన కుత్బుల్లాపూర్ నియోజవర్గం పార్టీ ఇంచార్జ్ నందగిరి సతీష్, పుష్పలత, వెంకటలక్ష్మి, పద్మజ, శేరిలింగంపల్లి నియోజకవర్గం పలు డివిజన్ల అధ్యక్షులు జెంజిపోగుల ప్రవీణ్ సాహు, అరుణ్ కుమార్ , ప్రదీప్, హరినాయక్, సిరా రాజేష్ , సుధాకర్, సాయి కృష్ణ, జన సైనికులు, జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు.






