శేరిలింగంపల్లి, నవంబర్ 26 (నమస్తే శేరిలింగంపల్లి): హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని జల వాయు విహార్ కాలనీ నుండి భీమునికుంట చెరువు ఔట్లెట్ బ్లాక్ అయ్యిందని కాలనీ వాసుల సమాచారం మేరకు GHMC ఇంజనీరింగ్, HMWSSB, ఇరిగేషన్ అధికారులతో కలసి కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు పరిశీలించి తక్షణమే పనులు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ గత సంవత్సర కాలంగా ఎటువంటి సమస్య లేకుండా ఔట్లెట్ ను శుభ్ర పరిచామని, ఈ మధ్య కాలంలో చెరువు వద్ద వ్యర్థాలు అధికంగా వేయడం వలన నాలా పూడుకుపోయి కాలనీ వాసులు ఇబ్బందులు పడుతున్నామని తెలపగా, అన్ని విభాగాల అధికారులను సమన్వయపరిచి తక్షణమే సమస్యను పరిష్కరించాలని చెప్పామని, అలానే ఏ చిన్న సమస్య అయినా తన దృష్టికి వస్తే తప్పకుండా పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ ఏఈ రాజీవ్, ఇరిగేషన్ అధికారి నరేందర్, HMWSSB అడిషనల్ DGM శివ, సూపర్వైజర్ నరేంద్ర, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.






