వ‌ల్ల‌భాయ్ ప‌టేల్‌ను యువ‌త స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలి: ర‌వికుమార్ యాద‌వ్

శేరిలింగంప‌ల్లి, న‌వంబ‌ర్ 26 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి ఉత్సవాల‌ను పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా 352 జిల్లాలో నిర్వహిస్తున్న యూనిటీ మార్చ్ కార్యక్రమాన్ని మియాపూర్ డివిజన్ విజేత సూపర్ మార్కెట్ నుండి బొల్లారం చౌరస్తా వద్ద ఉన్న చైతన్య కాలేజీ వరకు నిర్వహించారు. ఇందులో చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు కొండా విశ్వేశ్వర్ రెడ్డి పాల్గొని జెండా ఊపి కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించారు. యువకులు, విద్యార్థిని, విద్యార్థులతో నిర్వహించిన సమావేశంలో రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షుడు వనిపల్లి శ్రీనివాస్ రెడ్డి, కూకల్ ప‌ల్లి బీజేపీ నాయకుడు కాంతారావు, చేవెళ్ల పార్లమెంట్ కన్వీనర్ మల్లారెడ్డి, యూత్ అఫైర్స్ ఆఫీసర్ ఐజాక్, చైతన్య కాలేజీ ఏజిఎం రవికుమార్, కార్యక్రమ కన్వీనర్ మణిభూషణ్, ఇతర నాయకులతో కలిసి బీజేపీ శేరిలింగంపల్లి అసెంబ్లీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే, ఇంఛార్జి రవికుమార్ యాదవ్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ర‌వికుమార్ యాద‌వ్‌ మాట్లాడుతూ సర్ధార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకల‌ను ప్రతి సంవత్సరం జాతీయ ఐక్యతా దినోత్సవంగా జరుపుకుంటాం కానీ ఈ సంవత్సరం 150వ జయంతి ఉత్సవాల‌ను ఏక్ భారత్, ఆత్మనిర్భర్ భారత్ అనే నినాదంతో దేశమంతా జరుపుకోవడం చాలా మంచి విషయమన్నారు. పటేల్ దేశంలోని దాదాపు 565 సంస్థానాలను ఏకతాటిపైకి తెచ్చిన మహానాయకుడని, నిజాం నవాబుల అరాచక పాలనను తరిమి కొట్టి హైద్రాబాద్ ప్రజలకు 1948 లో స్వాతంత్రం తెచ్చిన మహనీయుడని కొనియాడారు, దేశం అంతా ఒక్కటే అని రాజ్యాలను దేశంలో కలిపి అందరూ ఐక్యంగా ఉండ‌డానికి ఎంతో కృషి చేశారన్నారు. పటేల్ స్పూర్తితో మన కోసం, మన దేశం ప్రజల కోసం మోదీ తయారీ రంగానికి, పరిశ్రమలకు, వ్యవసాయ రంగానికి, అన్ని రంగాలకు ఎన్నో సబ్సిడీ స్కీమ్స్ తీసుకొచ్చారని అన్నారు. మనమందరం సర్దార్ వల్లభాయ్ పటేల్, ప్రధాని నరేంద్ర మోదీస్పూర్తితో దేశమంతా ఒక్కటై విదేశీ టెక్నాలజీ, విదేశీ వస్తువులు తగ్గించి మన దేశంలో మన టెక్నాలజీతో మన వాళ్ళు తయారు చేసే వస్తువులు వాడుదామని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు రాధాకృష్ణ యాదవ్, మహిపాల్ రెడ్డి, అనిల్ గౌడ్, స్రవంతి, కృష్ణంరాజు, సీనియర్ నాయకులు రాఘవేంద్ర రావు, నాగేశ్వర్ గౌడ్, బుచ్చిరెడ్డి, ఎల్లేష్, హనుమంత్ నాయక్, డివిజన్ అధ్యక్షులు ఆకుల లక్ష్మణ్, జితేందర్, వేణుగోపాల్ రెడ్డి, అరవింద్, శివాసింగ్, బాలు యాదవ్, శ్రీనివాస్ రెడ్డి, అరుణ్ కుమార్, వంశీ రెడ్డి, సీనియర్ నాయకులు వెంకట స్వామి రెడ్డి, గోపాల్ రావు, కుమార్ యాదవ్, నర్సింగ్ రావు, సునీల్ రెడ్డి, గణేష్, నరసింహా చారి, భూపాల్ రెడ్డి, శ్రీకాంత్ , శ్రీనివాస్ , రాము, మహేంద్ర యాదవ్, నాయకులు, కార్యకర్తలు, యువకులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here