భారత రాజ్యాంగ దినోత్సవ అవగాహన కార్యక్రమం

శేరిలింగంప‌ల్లి, న‌వంబ‌ర్ 26 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): గౌలిదొడ్డిలోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలుర జూనియర్ కళాశాలలో విద్యార్థులకు భారత రాజ్యాంగ దినోత్సవ అవగాహన కార్యక్రమాన్ని ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బీ. ఆర్. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ అవగాహన కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ T అంజయ్య అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్శిటీ రాజనీతి శాస్త్ర విభాగ అధిపతి ఆచార్య A నాగేశ్వరరావు మాట్లాడుతూ 1949 నవంబరు 26న భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజ‌ని, ఈ రోజునే భారత రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటున్నామ‌ని తెలిపారు. గతంలో దీనిని నేషనల్ లా డేగా జరుపుకునేవారము. డాక్టర్ బీ. ఆర్. అంబేద్కర్ 125వ జయంతోత్సవమైన 2015వ సంవత్సరం నుండి భారత రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటున్నాము అని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులందరి చేత రాజ్యాంగ పీఠిక (ప్రియాంబుల్) ను చదివించారు. భావి భారత పౌరులైన విద్యార్థులు రాజ్యాంగం పట్ల అవగాహన కలిగి ఉండాల‌ని, ప్రతి పౌరుడు రాజ్యాంగాన్ని గౌరవించాల‌ని కోరారు. ఈ కార్యక్రమంలోవైస్ ప్రిన్సిపాల్ మల్లారెడ్డి, అధ్యాపకులు బసవయ్య , సత్యనారాయణ , లింగయ్య , భిక్షమయ్య , కిషోర్ , అంజి , డాక్టర్ లింగరాజు, విద్యార్థులు, ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here